చట్ట సవరణతోనే బీసీలకు 34% రిజర్వేషన్లు సాధ్యం: యువరాజు నాయుడు
రిపోర్టర్: Darla Venkateswarlu
స్థలం: తడ
పార్లమెంటులో చట్ట సవరణ చేయడం ద్వారానే బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు సాధ్యమవుతాయని ఏపీ బీసీ సంక్షేమ సంఘం సుల్లూరుపేట నియోజకవర్గ అధ్యక్షుడు ఈగ యువరాజు నాయుడు తెలిపారు. సుప్రీంకోర్టు పరిమితి తెలిసినా సంకీర్ణ ప్రభుత్వం ఓట్ల రాజకీయం కోసం జీవోలు ఇచ్చిందని విమర్శించారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు.