సోనమ్ వాంగ్చుక్ సంస్థకు భారీ షాక్: తరగతులు నిలిపివేయాలని లడఖ్ యంత్రాంగం ఆదేశం
రిపోర్టర్: సురేష్
స్థలం: Leh
లడఖ్ లోని సోనమ్ వాంగ్చుక్ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ కు యంత్రాంగం గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అధికారులు తెలిపారు. లేహ్ లోని డెసర్ట్ ఫ్లవర్ స్కూల్ లో తరగతులు, ఇతర కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టులో భూ వివాదం తేలే వరకు యథాస్థితిని పాటించాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా పాఠశాల కార్యకలాపాలు ప్రారంభించారని పేర్కొంటూ నవంబర్ ఒకటో తేదీన ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.