సేవే పరమావధిగా డఫోడిల్స్ హైస్కూల్ విద్యార్థుల గొప్ప బాధ్యత.. అమృత నేత్రాలయానికి రూ.27,626 విరాళం అందజేత
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
నర్సంపేటలోని డఫోడిల్స్ హైస్కూల్ విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో అమృత నేత్రాలయ బ్లైండ్ ఫౌండేషన్‌కు రూ.27,626 విరాళాన్ని అందజేశారు. చూపులేని వారి సంక్షేమానికి అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మానవతా విలువలు పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ను అమృత నేత్రాలయ ప్రతినిధులు ఘనంగా అభినందించారు.