అమెరికా చైనా ఘర్షణ అవాస్తమంటూ జిన్‌పింగ్ కీలక ప్రకటన
రిపోర్టర్: హరి
స్థలం: Beijing
అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తుక్యుడైడ్స్ ట్రాప్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారని విశ్లేషకులు తెలిపారు. అమెరికా చైనాల మధ్య ఘర్షణ ఎట్టిపరిస్థితుల్లోనూ అనివార్యం కాదని, ఇరు దేశాలు పరస్పర సహకారంతో కలిసి జీవించాలని ఆయన స్పష్టం చేశారు. చైనా ఆర్థిక, సాంకేతిక, సైనిక శక్తి పెరుగుతున్న తరుణంలో ప్రపంచ దేశాల మధ్య శాంతి భద్రతలు మరియు సహజీవనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని ఆయన పేర్కొన్నారు.