గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర నెట్వర్క్ సమస్య: చుక్కలు చూపిస్తున్న సంకేతాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

ప్రపంచం అరచేతిలోకి వచ్చినప్పటికీ అనేక గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్య తీవ్రంగా వేధిస్తోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట, చిల్లకూరు, రాపూరు, పొదలకూరు రూరల్, టీపీ గూడూరు మండలాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని తెలిపారు. అత్యవసర సమయాల్లోనూ సిగ్నల్స్ అందక సమాచారం చేరవేయలేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు.