కొత్త గ్యాస్ కనెక్షన్లపై ఇంకా కొనసాగుతున్న నిషేధం

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో కొత్త వంటగ్యాస్ కనెక్షన్ల మంజూరుపై నిషేధం ఇంకా కొనసాగుతోంది. కేంద్రం గ్యాస్ బుకింగ్ నిబంధనలు సడలించినప్పటికీ, డొమెస్టిక్ కనెక్షన్ల జారీకి అనుమతి ఇవ్వలేదు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది కొత్త దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ కనెక్షన్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.