ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం: వాట్సాప్ ద్వారా ప్రత్యేక టికెట్లు విడుదల

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయవాడ

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో జగన్మాత దివ్యదర్శన్ ప్రత్యేక టికెట్లను దేవస్థానం ఈవో ఎస్.శీనానాయక్ శుక్రవారం విడుదల చేశారు. సామాన్య భక్తులు ఎలాంటి సిఫారసులు లేకుండానే మనమిత్ర వాట్సాప్ నంబరు ద్వారా రూ.1000 రుసుముతో ఈ నెల 11, 12, 13 తేదీల టికెట్లు సులభంగా పొందవచ్చని ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వాహనాలు, స్లాట్ల కేటాయింపు వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు.