పుంగనూరు మున్సిపల్ ఎన్నికల కలకలం: హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ మిథున్ రెడ్డి

రిపోర్టర్: కృష్ణ స్థలం: చిత్తూరు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో హైడ్రామా నెలకొన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ న్యాయపోరాటానికి తెరలేపినట్లు ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడించారు. తమ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. న్యాయస్థానం నుంచి సానుకూల ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నామని, ఆదేశాలు అందగానే నామినేషన్లు దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.