కేసీఆర్ చావు కోరే షాద్‌నగర్ ఎమ్మెల్యేకు సోయి ఉందా: ఆల వెంకటేశ్వర్ రెడ్డి

రిపోర్టర్: రాజేష్ స్థలం: మహబూబ్ నగర్

కేసీఆర్ చావును కోరుతున్న షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు సోయి ఉందా అని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రస్టేషన్‌లో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలు వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.