స్థానిక సంస్థల ఎన్నికల వేళ తిరుపతి జిల్లాలో కఠిన భద్రతా ఏర్పాట్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: తిరుపతి

ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తిరుపతి పోలీస్ శాఖ వెల్లడించింది. నామినేషన్ అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు మరియు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్ల సంచారంపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఓబులవారిపల్లి టౌన్లో ఎస్ఐ కె. సుజన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు.