అక్టోబర్ 30న థియేటర్లలోకి ఇట్లు అర్జున సినిమా
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాణంలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న చిత్రం ఇట్లు అర్జున. మహేష్ ఉప్పల దర్శకత్వంలో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా, మూగ కుర్రాడిగా అనీష్ పాత్ర, యాక్షన్, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 30న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.