ఆదోని కపటి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా గిడ్డయ్య ఎన్నిక
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు మంగళవారం ఘనంగా జరిగాయి. తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి బంట్రోతు గిడ్డయ్య చైర్మన్గా, హరిజన సునీత వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమను ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపిన నూతన కమిటీ సభ్యులు, పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.