'ఫామ్‌హౌస్ భూములపై విచారణ జరిపిస్తాం': సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం విచ్చలవిడిగా భూములు దోచుకుందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరిట భారీగా ఆస్తులు ఉన్నాయని లెక్కలతో సహా సభ ముందుంచిన ఆయన, ఫామ్‌హౌస్ భూముల సరిహద్దులు, రికార్డులపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ తేలితే 30 రోజుల్లో స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.