సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత రామ్ గోవింద్ చౌదరి కన్నుమూత
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Lucknow
సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రామ్ గోవింద్ చౌదరి కన్నుమూశారని ఎస్పీ మీడియా ఇన్చార్జ్ సుశీల్ పాండే తెలిపారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.