దేశంలో తీవ్రమవుతున్న పౌష్టికాహార లోపం: నివేదికలు వెల్లడిస్తున్న నిజామిది
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ పౌష్టికాహార లోపం సమస్య తీవ్రంగా వేధిస్తోందని ఐక్యరాజ్యసమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల్ లో చాలామంది తక్కువ బరువుతో పుడుతున్నారని, సరైన పర్యవేక్షణ కొరవడటం వల్లే తల్లీబిడ్డలకు అందాల్సిన పోషకాలు పక్కదారి పడుతున్నాయని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టి సమస్యను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.