విజయనగరంలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయనగరం
సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు స్పష్టం చేశారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో వీఎమ్ఆర్డీఏ నిధులతో రూ.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌తో కలిసి ఆమె గురువారం ప్రారంభించారు. నగర సుందరీకరణతో పాటు పార్కుల్లో ఆహ్లాదకర వాతావరణం, చిన్నారుల కోసం ఆటవస్తువులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.