దేశవ్యాప్తంగా యాభై వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

దేశంలో పండుగల సీజన్ ప్రారంభమైన వేళ వేలాది కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే కీలక నిర్ణయం వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న యాభై వేలకు పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందజేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నియామకాలు యువత భవిష్యత్తుకు భద్రత కల్పిస్తాయని తెలిపారు.