టీమిండియా సెలక్షన్లపై సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన: విదేశీ పిచ్లపై ఆడలేనంటారా

రిపోర్టర్: విజయ్ స్థలం: ముంబై

భారత టెస్టు జట్టులో చోటు దక్కకపోవడంపై ప్రముఖ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం దేశీయ పిచ్లపై మాత్రమే రాణించగలడనే అభిప్రాయం తనపై ఉందని ఆయన వాపోయారు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనల్లోనూ తాను శతకాలు బాదినట్లు గుర్తుచేశారు. తండ్రి నౌషాద్ పడుతున్న కష్టమే తనను నిత్యం ముందుకు నడిపిస్తోందని, ఎక్కడైనా సరే క్రికెట్ ఆడటమే తన ప్రధాన లక్ష్యమని ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ స్పష్టం చేశారు.