తిరుమలలో భారీ వర్షం బీభత్సం: ఎడతెరిపిలేని వానతో అస్తవ్యస్తమైన జనజీవితం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తిరుపతి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు. దట్టమైన పొగమంచు, నల్లటి మబ్బులు కొండను కమ్మేయడంతో సాధారణ జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు భారీ వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.