కొనారెడ్డి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్థన్నపేట పరిధిలోని కొనారెడ్డి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి పరిశీలించారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి కమిషనర్ కమ్మం కృష్ణ, విద్యుత్ డి.ఈ. దానయ్య తదితరులు పాల్గొన్నారు.