మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్ పిలుపునిచ్చారు. నశా ముక్త్ భారత్ లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో అవగాహన కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో అక్షర స్ఫూర్తి ఫౌండేషన్, తెలంగాణ ఈగల్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన సైకిల్ అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యువతను ఉత్సాహపరిచారు.