ఢిల్లీలో ఆంక్షలపై ఏపీ కాంగ్రెస్ ధ్వజం: ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi / Andhra Pradesh
ప్రశ్నిస్తే అరెస్టులు, నిరసన తెలిపితే ఆంక్షలు విధించడంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తుచేసేలా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యంపై నీలిమడలు కమ్ముకునేలా చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల గొంతుకను అణచివేయకుండా ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.