కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మిక వార్షిక తనిఖీ

రిపోర్టర్: గోపి స్థలం: మెదక్

మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్ స్టేషన్ను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆకస్మికంగా వార్షిక తనిఖీ నిర్వహించారని మెదక్ జిల్లా పోలీస్ వెల్లడించారు. ఈ సందర్భంగా స్టేషన్కు సంబంధించిన రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై అధికారులతో సమీక్ష జరిపారు. పెండింగ్ కేసుల దర్యాప్తు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల భద్రత కోసం రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.