వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇంకాందని పూర్తిస్థాయి పునరావాస ప్యాకేజీ

రిపోర్టర్: సురేష్ స్థలం: మార్కాపురం

వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్‌ జలాశయంలోకి నీరు విడుదల చేసినప్పటికీ, ముంపునకు గురైన గ్రామాల్లో ఇప్పటికీ వేలాది నిర్వాసిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో పునరావాస ప్యాకేజీ అందలేదు. గెజిట్‌లో పేర్లు లేనివారిలో అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించి దెబ్బతిన్న కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.