వ్యవసాయంలో క్లైమేట్ ఇంటెలిజెన్స్ విప్లవం: తెలంగాణ ఉద్యాన వర్సిటీ వీసీ వెల్లడి
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
వాతావరణ మార్పులను తట్టుకునేందుకు వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో క్లైమేట్ ఇంటెలిజెన్స్ విప్లవం గేమ్‌చేంజర్‌గా నిలవనుందని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతతో వాతావరణ అంచనాల్లో కచ్చితత్వం పెరిగిందని తెలిపారు. డిజిటల్ క్రాప్ డేటాబేస్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి స్పష్టం చేశారు.