టీఎన్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తమిళనాడు
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 27, 2026 న రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్‌లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.