డీఎస్సీ 2.0 నోటిఫికేషన్కు ఏర్పాట్లు చేయాలి: మంత్రి నారా లోకేశ్ ఆదేశం

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

నెల రోజుల్లో డీఎస్సీ రెండు పాయింట్ సున్నా నోటిఫికేషన్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు.