పర్యావరణ యోధులకు అక్టోబర్ 31న రంగారెడ్డిలో యంగ్ ఎర్త్ లీడర్స్ పురస్కారాలు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దే యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం వార్షిక పురస్కారాల ప్రదానోత్సవం అక్టోబర్ 31న రంగారెడ్డి జిల్లాలోని ది ఎర్త్ సెంటర్లో జరగనుంది. సిజిఆర్ సంస్థ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎర్త్ క్లబ్స్ ద్వారా విద్యార్థులు చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ వేడుకలో జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించి ఘనంగా సత్కరించనున్నారు.