హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం

రిపోర్టర్: శివ స్థలం: మొయినాబాద్

హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ప్రత్యూష దుర్మరణం చెందిందని సీఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. అతివేగంగా దూసుకెళ్లిన కారు రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ పైపులను బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.