వరల్డ్స్కిల్స్ పోటీలకు అర్హత సాధించిన పిడిలైట్ శిక్షణ పొందిన యువకులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: షాన్‌ఘై

చైనాలోని షాంఘై వేదికగా జరగనున్న అంతర్జాతీయ వరల్డ్స్కిల్స్ 2026 పోటీల్లో భారత్ తరఫున పాల్గొనేందుకు పిడిలైట్ ఇండస్ట్రీస్ శిక్షణ పొందిన ప్రకాష్ సుతార్, పంకజ్ జంగ్రా అర్హత సాధించారు. పిడిలైట్ వుడ్వర్కింగ్ అండ్ ప్లంబింగ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్కిల్స్ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ యువకులు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.