ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవడంలో కేంద్రం సహకరించాలి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi / Hyderabad

దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎల్నినో ప్రభావం అధికంగా ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ముఖ్యమంత్రి కలసి ఈ అంశంపై చర్చించారు.