భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో భారీగా పెరిగిన మొబైల్ ధరలు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఈ ఏడాది ప్రథమార్ధంలో మొబైల్ ఫోన్ల ధరలు సగటున పదహారు శాతం మేర పెరిగినట్లు కౌంటర్పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. మెమొరీ మరియు స్టోరేజ్ కొరత కారణంగా ధరల పెరుగుదల తీవ్రంగా ఉందని సంస్థ తెలిపింది. ముఖ్యంగా పది వేల రూపాయల లోపు ధర గల బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లపై ఇరవై తొమ్మిది శాతం వరకు భారం పడినట్లు నివేదిక స్పష్టం చేసింది.