కర్నూలులో ఉద్రిక్తత: పుర ఎన్నికల పోలింగ్ లో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ
రిపోర్టర్: సతీష్
స్థలం: Kurnool
కర్నూలు జిల్లాలో పుర ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదోని, ఎమ్మిగనూరులలో పోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపించగా, పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.