కశ్మీర్ లోని ఎత్తైన ప్రాంతాల్లో తొలి హిమపాతం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Jammu and Kashmir
జమ్మూ కశ్మీర్‌లోని గుల్మార్గ్, గురజ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్ తొలి హిమపాతం నమోదైంది. బారాముల్లా జిల్లాలోని అఫర్వత్, తులైల్ లోయలోని కాబుల్ గలీ ప్రాంతాలు మంచుతో తెల్లగా మెరిసిపోయాయి. శ్రీనగర్ సహా లోయలోని మైదాన ప్రాంతాల్లో రాత్రి వేళ వర్షాలు కురిశాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో వాతావరణంలో తీవ్రమైన చలి నెలకొందని, శుక్రవారం నుంచి వాతావరణం పొడిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.