చెల్లని ఓట్లు పడితే పోలింగ్ సిబ్బందిపై ఉక్కుపాదం మోపుతాం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
చెల్లని ఓట్లు అధిక శాతం నమోదైతే సంబంధిత పోలింగ్ సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల పరిశీలకుడు చిన్న రాముడు హెచ్చరించారు. తుమరాడ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, ఓటర్లకు బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ గుర్తును సరిగ్గా వేసే విధానంపై అవగాహన కల్పించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటు విలువైనదని, ఓటర్లు సరైన పద్ధతిలో ఓటు వేయాలని ఆయన కోరారు.