సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం అకాల మరణంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర సంతాపం
రిపోర్టర్: మహేష్
స్థలం: నల్గొండ
సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం అకాల మరణం పట్ల రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, బాలసుబ్రమణ్యం మృతి ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.