పవన్ లోకేశ్ విమాన ప్రయాణాలపై వైకాపా దుష్ప్రచారం చేస్తోంది
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ విమాన ప్రయాణాలకు ఏపీఏసీఎల్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వారిద్దరూ సొంత ఖర్చులతోనే విమాన ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొంది. చంద్రబాబు, పవన్, లోకేశ్ విమానయాన ఖర్చులపై సామాజిక మాధ్యమాల వేదికగా వైకాపా వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అమరావతిలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.