విశాఖలో తుఫాను ముందస్తు చర్యలు: జీవీఎంసీ సిబ్బందితో కలిసి రంగంలోకి పోలీసులు

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్నం

అర్నాబ్ తుఫాను ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా విశాఖ నగరంలో రోడ్లపై నీరు నిలవకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జీవీఎంసీ సిబ్బందితో కలిసి తక్షణ నివారణ చర్యలు చేపట్టామని విశాఖ నగర పోలీసులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు రాకుండా బార్ గేట్లు ఏర్పాటు చేశామని, పడిపోయిన చెట్లను తొలగించి రాకపోకలను సులభతరం చేశామని పోలీసు శాఖ స్పష్టం చేసింది.