రాష్ట్రంలో వర్షాలు: కోస్తాంధ్రలో రెండ్రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే అవకాశం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్రలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.