విచారణ పేరుతో తనపై ఎస్సై భౌతిక దాడి చేశారంటూ బాధితుడు ఆవేదన
రిపోర్టర్: శివ
స్థలం: పార్వతీపురం మన్యం జిల్లా
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పోలీసు స్టేషన్లో విచారణ పేరుతో ఎస్సై నారాయణరావు తనపై భౌతికంగా దాడి చేశారని కొమరాడ మండలం మాదలింగి గ్రామానికి చెందిన బర్ల ఆదినారాయణ ఆరోపించారు. శుక్రవారం పోలీసు స్టేషన్కి పిలిపించి ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా తీవ్రంగా కొట్టారని, బంధువులు అడిగితే స్టేషన్ నుంచి బయటికి తోసేశారని ఆయన వాపోయారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎస్సై ఖండించారు.