మేఘాంశ్ శ్రీహరి 'ఆస్మాన్' సినిమా టీజర్ విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'ఆస్మాన్' సినిమా టీజర్‌ను హీరో మంచు మనోజ్ విడుదల చేశారు. శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, అరబిక్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రాయంచ హీరోయిన్‌గా నటిస్తున్నారు.