వర్షాల ప్రభావంపై కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లాలో భారీవర్షాల ప్రభావంపై కలెక్టర్‌తో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రోడ్లపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని సూచించారు. తక్షణమే పంటనష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు.