అరుణాచల్ ప్రదేశ్లో ఉద్రిక్తత: జలవిద్యుత్ ప్రాజెక్ట్ వ్యతిరేక ఆందోళనల్లో భారీ హింస

రిపోర్టర్: హరి స్థలం: Pasighat

అరుణాచల్ ప్రదేశ్లో ప్రతిపాదిత సియాంగ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయని, ఎన్హెచ్పీసీ కార్యాలయం, పోలీస్ స్టేషన్తో పాటు పలువురి నివాసాలపై ఆందోళనకారులు దాడి చేసి నిప్పుపెట్టారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హిబు తామంగ్ వెల్లడించారు. ఈ ఘర్షణల్లో నలభై మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని, పాసిఘాట్ ప్రాంతంలో ఆంక్షలు విధించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.