వ్యాపార అనుమతుల కోసం నేషనల్ సింగిల్ విండో సిస్టమ్

రిపోర్టర్: రాము స్థలం: Andhra Pradesh / Telangana

వ్యాపార అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అందుబాటులో ఉందని పీఐబీ ఇండియా వెల్లడించింది. ఎటువంటి సంక్లిష్టత లేకుండా దెగ్గరుండి అనుమతులు పొందడం, పత్రాలు సమర్పించడం మరియు దరఖాస్తులను ట్రాక్ చేయడం వంటి అన్ని సేవలు ఒకే డిజిటల్ వేదికపై లభిస్తాయని పేర్కొంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే పారిశ్రామికవేత్తలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.