ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే చర్లపల్లి నుంచి విజయవాడ, విశాఖపట్నంల మీదుగా శ్రీకాకుళం రోడ్ స్టేషన్ వరకు 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి నుంచి అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రతి మంగళవారం, శ్రీకాకుళం రోడ్ నుంచి ప్రతి బుధవారం ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని, నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి సహా పలు ప్రధాన స్టేషన్లలో వీటికి హాల్టింగ్ ఉంటుందని వెల్లడించింది.