మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత ప్రవర్తన.. భూక్యా జాన్సన్ నాయక్ నిరసన
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడంతో పాటు మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో మహిళలతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్న ప్రభుత్వ తీరును నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.