విద్యార్థులకు అలర్ట్: ఎస్ఎస్సీ ఫేజ్ 14 ప్రాథమిక కీ విడుదల
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ ఫేజ్ 14 రాత పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 16 నుండి 26 వరకు ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ ద్వారా కీని డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు అభ్యంతరాలు తెలపాలని స్పష్టం చేశారు.