యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్.. ఆ కీలక ఫీచర్లు మాయం?
రిపోర్టర్: అశోక్
స్థలం: India
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. సెప్టెంబర్ 9న జరిగే ఈవెంట్లో ఇది లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అయితే స్లిమ్ డిజైన్ కోసం దీనిలో ఫేస్ ఐడీ, టెలిఫోటో కెమెరా వంటి కీలక ఫీచర్లు మాయం కానున్నట్లు తెలుస్తోంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.1.6 లక్షలకు పైగా ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.