ఏ ప్లస్ గ్రేడ్‌తో విజయనగరం జిల్లాకు రెండో స్థానం
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయనగరం
అమరావతిలో కలెక్టర్ల సదస్సులో విజయనగరం జిల్లా ప్రగతిని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు వివరించారు. కేపీఐఎస్‌లో 92 శాతం ప్రగతి సాధించి జిల్లా ఏ ప్లస్ గ్రేడ్‌తో రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, సేవల రంగంలో రూ.1,900 కోట్ల ఆదాయంతో 11.8 శాతం వృద్ధిరేటు సాధించినట్లు వెల్లడించారు.