మిషన్ జ్యోతిర్గమయ: నిరాశ్రయులకు ఉచితంగా ఆహారం అందిస్తున్న విశాఖ పోలీసులు
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలో పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి చేపట్టిన మిషన్ జ్యోతిర్గమయ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్ల ద్వారా నిరాశ్రయులకు ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు విశాఖ నగర పోలీసులు వెల్లడించారు. ఆహారం వృథా కాకుండా ఆకలితో ఉన్నవారికి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ సేవలను నిరంతరం కొనసాగిస్తున్నామని, ప్రజలు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తూ అత్యవసర సహాయం కోసం నూట పన్నెండు నంబరును సంప్రదించాలని సూచించారు.